ఏప్రిల్ 17న వచ్చే అమావాస్య ఖగోళ పరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. అదే రోజున గురు, శుక్ర గ్రహాల సంచారంతో పాటు చంద్రుడు కుంభం నుంచి మీనంలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ మార్పుల వల్ల బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాలు కర్కాటక, కుంభ, తుల, ధనస్సు రాశుల వారికి కొత్త అవకాశాలు, పురోగతి, ఆర్థిక స్థిరత్వం, గౌరవం, ఉద్యోగ అవకాశాలు తెచ్చిపెట్టనున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.