టైర్ పేలి బోల్తా పడ్డ APSRTC బస్సు.. 20 మందికి గాయాలు (వీడియో)

AP: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం వద్ద మంగళవారం మదనపల్లె-తిరుపతి హైవేపై ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావడంతో కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మదనపల్లె డిపోకు చెందిన ఈ నాన్‌స్టాప్ బస్సు తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని వాల్మీకిపురం ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం కొందరిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕