రామాయణ కోసం 12 సినిమాలు వదులుకున్న ఏఆర్ రెహమాన్

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సుమారు మూడేళ్లు శ్రమించారు. ఈ భారీ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకు ఆయన ఏకంగా 10 నుంచి 12 సినిమాలను వదులుకున్నారు. తాజాగా ఇఫి (IFFI) కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ, రావణ తాండవం కోసం 13 వెర్షన్ల సంగీతాన్ని స్వరపరిచినట్లు తెలిపారు. కేవలం బడ్జెట్, స్టార్ హీరోల కోసం కాకుండా, తనకు సృజనాత్మక సంతృప్తినిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕