ఉరేసుకుని ఏఆర్ SI ఆత్మహత్య

తెలంగాణలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏఆర్ ఎస్సై నర్సయ్య (38) తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో AR ఎస్సైగా నర్సయ్య విధులు నిర్వహిస్తున్నారు. నర్సయ్య భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్