సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. కళాకారులను నేరస్తులుగా, ఉగ్రవాదులుగా భావించి అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని ఆమె ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులను గౌరవించడమేనని, కానీ ప్రస్తుతం అది 'బూతులు తిట్టే హక్కు'గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి అభిప్రాయాలు నచ్చకపోతే అన్‌ఫాలో చేయాలని, అసభ్య పదజాలంతో దూషించడం వేధింపేనని ఆమె తేల్చి చెప్పారు.