థైరాయిడ్ సమస్యలకు జన్యువులే కారణమా?

ప్రస్తుత జీవనశైలిలో థైరాయిడ్ సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అయితే ఈ సమస్యలకు కేవలం ఆహారం లేదా ఒత్తిడి మాత్రమే కాకుండా, జన్యువుల పాత్ర కూడా గణనీయంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడైటిస్, గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. కుటుంబంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరసం, బరువులో ఆకస్మిక మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్