గతంలో మొబైల్ కంపెనీల మధ్య పోటీతో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఫోన్లు లభించేవి. అయితే, మెమొరీ చిప్‌ల ధరలు 300% పెరగడంతో, స్మార్ట్‌ఫోన్ల ధరలు 30% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI డేటా సెంటర్ల కోసం టెక్ కంపెనీలు మెమొరీ వనరులను భారీగా కొనుగోలు చేయడమే దీనికి కారణం. దీంతో, కంపెనీలు ధరలు పెంచడం, ర్యామ్, స్టోరేజ్ వంటి ఫీచర్లను తగ్గించడం వంటి రెండు మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. భారత మార్కెట్‌లో ఇప్పటికే కొన్ని ప్రీమియం ఫోన్ల ధరలు రూ.7,000 వరకు పెరిగాయి. కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.