వర్షాకాలంలో ఇంటి చుట్టూ, లోపల పాములు కనిపించడం సర్వసాధారణం. అయితే, పదే పదే పాములు కనిపించడం వాస్తు దోషాన్ని సూచిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, హాని చేయని పాము కనిపించడం పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు. పాము రంగును బట్టి కూడా ఫలితాలు మారుతాయని పండితులు చెబుతున్నారు.