BRS ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా: మంత్రి పొన్నం

TG: జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చెప్పుకోలేకే వివిధ అంశాలను తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గానికి బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. దీనిపై యూసుఫ్‌గూడ చౌరస్తాలో చర్చించేందుకు తాము సిద్ధమన్నారు.

సంబంధిత పోస్ట్