చలికాలంలో చర్మం పొడిబారినప్పుడు తేమను నిలుపుకోవడం చాలా ముఖ్యం. పొడిబారిన పెదవులపై గ్లిజరిన్, లిప్‌బామ్‌లు హానికరంగా ఉండొచ్చు. దీనికి బదులు ఆవు నెయ్యి రాసుకోవడం ఉత్తమం. గ్లిజరిన్, రోజ్ వాటర్‌ను ఎలా పడితే అలా వాడితే చర్మానికి హాని జరిగే ప్రమాదం ఉంది. పొడి చర్మం ఉన్నవాళ్లు ఆయిల్ బేస్ట్ మాయిశ్చరైజర్, జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వాటర్ బేస్ట్ మాయిశ్చరైజర్ వాడితే మంచింది. చర్మ రకానికి అనుగుణంగా ఉత్పత్తులు ఎంచుకోవాలి.