‘నో బయ్’ ట్రెండ్ గురించి తెలుసా?

సోషల్ మీడియా తెరిస్తే చాలు.. వస్త్రాలు, ఉత్పత్తులు, డెకార్ ఎన్నెన్ని ఆకర్షణలు? నచ్చడమే ఆలస్యం కార్ట్‌లోకి కొట్టేయడమే. కానీ కొనేముందు అత్యవసరమా అనే దానిపై ఆలోచిస్తున్నారట నేటి యువత. దాన్నే ‘నో స్పెండ్’ లేదా ‘నో బయ్’ మంత్ ట్రెండ్ అని పిలుస్తున్నారు. మరీ తప్పని పరిస్థితుల్లో కొనాల్సి వస్తే ‘లెస్ స్పెండ్ మంత్’ని ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఖర్చులను బ్యాలెన్స్ చేయడం తెలుస్తుంది. ఉన్నవాటితోనే కొత్త ప్రయోగాలు చేయడం అలవాటవుతుంది.

సంబంధిత పోస్ట్