బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి

ఆధునిక జీవనశైలిలో రక్తపోటు (బీపీ)ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం సాధారణమైంది. అయితే, చాలామందికి బీపీ కొలిచే సరైన విధానం తెలియక తప్పుడు రీడింగులు పొందుతుంటారు. కచ్చితమైన ఫలితం కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని కీలకమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు. పరీక్షకు ముందు కనీసం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. టీ, కాఫీ, వ్యాయామం, పొగతాగిన తర్వాత 30 నిమిషాలు ఆగాలి. కొలిచేటప్పుడు వెన్నుకు ఆసరా ఇచ్చి, పాదాలు నేలపై సమంగా ఆనించి, కాళ్లు క్రాస్ చేయకుండా నిటారుగా కూర్చోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕