పొత్తుతో వస్తున్నారా? సింగల్‌గా వస్తున్నారా?: పవన్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ పరోక్షంగా స్పందించారు. “మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? అనేది చెప్పి రండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ‘జస్ట్ ఆస్కింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అయితే తన పోస్టులో ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు జనసేన అధినేతను ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు

సంబంధిత పోస్ట్