కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. కూల్ డ్రింక్స్ వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయని సైంటిస్టులు అంటున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు 7 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారి ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరించారు.