ప్రెగ్నెన్సీలో మహిళలు సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.