దీపావళి గిఫ్ట్ తీసుకుంటున్నారా..? బీ అలర్ట్

దీపావళి పండుగ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే, ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల నుండి వచ్చే బహుమతులకు పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, స్నేహితులు, బంధువులు లేదా ఇతరుల నుండి ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల విలువకు మించి బహుమతులు పొందితే, దానిని 'ఇతర వనరుల ఆదాయం'గా పరిగణించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకే రోజులో ఎవరి నుండైనా రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోవడం ఐటీ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి బహుమతుల లావాదేవీలపై జాగ్రత్త వహించాలి.

సంబంధిత పోస్ట్

✕
✕