గిన్నెలు కడిగేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సింక్‌లో గంటల తరబడి గిన్నెలు వదిలేయడం, పాత స్క్రబ్బర్‌ను వాడటం, ఎక్కువ సోప్ వాడటం, తడి చేతులు, తువ్వాళ్లతో తుడవడం వంటివి బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతాయి. జిడ్డు ఎక్కువగా ఉన్న గిన్నెలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల అవి శుభ్రపడటమే కాకుండా క్రిమిరహితంగా మారతాయి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు, కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.