రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?: హరీష్‌రావు

TG: సీఎం రేవంత్ రెడ్డిని రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సిద్దిపేటలో జరిగిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతుబంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, బీఆర్ఎస్ హయాంలో 90 లక్షల వడ్లు కొన్నామని తెలిపారు. రైతుబంధు ఎగ్గొట్టినందుకు, రైతు బీమా ఆపేసినందుకు రైతులందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్