నేటి బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఉదయంపూట అల్పాహారం తినటం మానేస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడి, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందట. దీనివల్ల నిత్యజీవితంలో పనితీరు మందగించి, ఉత్సాహం తగ్గుతుందని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం గడిపితే జీవక్రియ తగ్గే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు.