అసిడిటీతో ఇబ్బంది పడుతున్నవారికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపశమనం కలిగించగలవు. చల్లటి పాలు తాగడం, యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తీసుకోవడం, తులసి ఆకుల రసం, గోరువెచ్చని నీళ్లలో అల్లం రసం, సోంపు పొడి కలిపి తాగడం వంటి చిట్కాలు అసిడిటీ సమస్యను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు కూడా మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.