పార్కింగ్ విషయంలో గొడవ.. తుపాకీతో కాల్చి వ్యక్తి హత్య

హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరమ్‌జీత్ ధన్‌కర్ అనే వ్యక్తి నవంబర్ 24న జరగబోయే మేనల్లుడి పెళ్లి కోసం ఇటీవల సింగపూర్‌ నుంచి వచ్చాడు. అయితే కారు పార్కింగ్ విషయంలో పొరుగింట్లో ఉండే మోహన్ శర్మ అనే వ్యక్తి ఆయనతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తన జేబులో నుంచి తుపాకీ తీసి పరమ్‌జీత్‌పై 15-16 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. మోహన్ శర్మ కాసేపు రాద్ధాంతం సృష్టించి.. అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕