పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు ఆర్మీ అధునాతన ATOR N1200 (ATV) వాహనాలను మోహరించింది. ఈ వాహనాలు లోతైన నీరు, కఠినమైన భూభాగాల్లో ప్రయాణిస్తాయి. రెస్క్యూ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇవి సహాయపడుతున్నాయి. ATOR N-1200 స్పెషల్ మొబిలిటీ వెహికల్స్ ను JSW గ్రూప్ భారత సైన్యం కోసం రూపొందించింది. అమృత్ సర్ లో ఆర్మీ ఈ వాహనాలను రంగంలోకి దిగించింది.