ఈనెల 2న రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ స్టేషన్ లో జమ్ము తవి - సబర్మతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్ జిగర్ చౌదరీ దారుణ హత్యకు గురయ్యాడు. మార్గం మధ్యలో దుప్పటి, బెడ్ షీట్ కావాలని రైల్వే కోచ్ అటెండెంట్ జుబైర్ మెమోన్ ను అడిగాడు. అవి ఇవ్వలేనని చెప్పడంతో వాగ్విదాం జరిగింది. చివరికి కత్తితో దాడి చేయడంతో జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.