అందరి ముందు ప్రేయసిని పెళ్లి చేసుకోమని అడిగిన ఆర్మీ అధికారి

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా కెప్టెన్ భరత్ భరద్వాజ్ అనే ఆర్మీ అధికారి అందరి ముందూ తన ప్రేమను వ్యక్తపరిచి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోమని అడిగాడు. పరేడ్ ముగిసిన తర్వాత అందరూ చూస్తుండగానే అతను మోకాళ్లపై కూర్చుని ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్