అధికారి పరువు తీయడానికే ఆర్మీ ఆయుధాల చోరీ: మల్లేశ్

TG: హైదరాబాద్‌లోని బొల్లారంలో మద్రాస్ రెజిమెంట్‌‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తనని ఒక ఉన్నతాధికారి వేధింపులకు గురి చేశాడని, ఆయన పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఆయుధాలు దొంగిలించినట్లు మాజీ ఆర్మీ హవల్దార్ మల్లేశ్ పోలీసులకు వెల్లడించాడు. ఆరు నెలల ముందే ఈ పథకం రచించినట్లు తెలిపాడు. మల్లేశ్ ఉద్యోగంలో చేరక ముందే రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెజిమెంట్‌లో దురుసు ప్రవర్తన, నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారి అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕