ఏపీలో 'అర్నబ్' తుఫాన్ సృష్టించిన బీభత్సంపై మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఈ తుఫాన్ ధాటికి 14 జిల్లాల్లో 2,24,489 హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు ఆయన వివరించారు. ఇందులో వరి 2,09,460 హెక్టార్లు, ఉద్యాన పంటలు 12,763 హెక్టార్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో 76,176, కోనసీమ 44,232, కాకినాడలో 42,222 హెక్టార్లలో తీవ్ర నష్టం వాటిల్లిందని, దాదాపు 3.45 లక్షల మంది రైతులపై ప్రభావం పడిందని మంత్రి అచ్చెన్నా తన లేఖలో స్పష్టం చేశారు.