బ్రిటన్‌కు చెందిన శక్తివంతమైన ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానం కేరళలో చిక్కుకుపోయింది. జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఈ జెట్‌కు మరమ్మతులు సాధ్యపడకపోవడంతో, దాన్ని విడిభాగాలుగా చేసి బ్రిటన్‌కు తరలించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పేరున్న దీనిని ఇలా రెక్కలు విడదీసి తీసుకెళ్లాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది.