హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద భారత రాష్ట్రసమితి శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించిన బీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును అరెస్ట్ చేశారు. కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.