నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దూబే (79), ఆయన భార్య అర్జూ రాణా దూబేకు అవినీతి కేసులో ఖాఠ్మాండు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. దూబే దంపతులు విదేశాల్లో వైద్య చికిత్స పొందుతున్నారని, వారిపై వచ్చిన ఆరోపణలను దూబే కొట్టిపారేశారు. ఇటీవల నేపాల్‌లో ప్రధానిగా ఎన్నికైన బాలేంద్ర షా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దూబే ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.