అరుణాచల్‌ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి వైమానిక దళం

అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్‌ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది. అటవీ సంపద అగ్నికి ఆహుతైపోతోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన భారత వైమానిక దళం MI-17V5 హెలికాప్టర్‌లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. 9,500 అడుగుల ఎత్తు నుంచి ఆపరేషన్ చేయడం రెస్క్యూ టీమ్స్‌కు సవాల్‌గా మారింది. అరుణాచల్‌ ప్రభుత్వం అభ్యర్థన మేరకు వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కార్చిచ్చుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు వివరాలు వెల్లడించలేదని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్తగా పరిసర గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్