స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు పూర్తయినా కలెక్షన్ల జోరు తగ్గలేదు. ముఖ్యంగా సెకండ్ వీకెండ్‌లో అద్భుతమైన స్పందనతో ఆదివారం భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లో రూ.78.71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమా లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.