ఆరోగ్యం కోసం ఉదయాన్నే పడిగడుపున బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం ట్రెండీగా మారింది. అయితే దీనిలోని ఆక్సిలేట్స్ అనే యాంటీ-న్యూట్రియంట్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చి జ్యూస్ తాగడం అందరికీ సరైనది కాదని, ఆక్సిలేట్ కంటెంట్ తగ్గించడానికి గుమ్మడికాయను ఉడకబెట్టి లేదా వేయించి జ్యూస్ చేసుకోవాలని సూచిస్తున్నారు. డిటాక్స్ జ్యూస్‌లు అనేవి స్కామ్ అని, శరీరం సహజంగానే డిటాక్స్ అవుతుందని, సరైన జీవనశైలి, వ్యాయామం, పౌష్టికాహారం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని నిపుణులు తెలిపారు.