యాషెస్ సిరీస్.. సిడ్నీలో కట్టుదిట్టమైన భద్రత

యాషెస్ సిరీస్ లో భాగంగా సిడ్నీలో ఆదివారం ప్రారంభం కానున్న ఐదో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఇటీవలే బోండీ బీచ్ లో జరిగిన ఉగ్రదాడి దృష్ట్యా మైదానం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సాయుధులైన పోలీసులు గస్తీ కాస్తారని న్యూసౌత్ వేల్స్ పోలీసు కమిషనర్ మాల్ లాన్యోన్ తెలిపారు. పోలీసులు మైదానంతో పాటు, సమీపంలోని పార్క్, రైల్వేస్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. గత సంవత్సరం బోండీ బీచ్ లో కాల్పులు జరిపి 15 మంది మృతికి కారణమైన ఉగ్రవాది నవీద్ అక్రమ్ పై 59 అభియోగాలను నమోదు చేశారు. అందులో 15 హత్య కేసులున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్