ఆసియా కప్ ఫైనల్: విజేతకు రూ. 2.6 కోట్లు

ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరగనునన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇది గత ఎడిషన్ కంటే రెట్టింపు. 2023లో విజేతగా నిలిచిన భారత్‌కు రూ. 1.5 కోట్లు దక్కాయి. రన్నరప్‌కు రూ. 1.3 కోట్లు అందనున్నాయి, గతంలో ఇది రూ. 82 లక్షలు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు రూ. 12.5 లక్షలు కేటాయించారు. టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మపై అంచనాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్