ఆసియా కప్ 2025లో దుబాయ్ వేదికగా భారత్-యూఏఈ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. భారత బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు కుప్పకూలిపోతున్నారు. 50 పరుగులకే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయి యూఏఈ కష్టాల్లో పడింది. కుల్దీప్ 3, బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం యూఏఈ స్కోర్ 50/5.