ఆసియా బాక్సింగ్: 8 పతకాలతో మెరిసిన భారత్

మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 8 మంది బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకుని, 8 పతకాలు ఖాయం చేసుకున్నారు. వీరిలో ప్రపంచ ఛాంపియన్లు మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సహా ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. మీనాక్షి థాయ్‌లాండ్‌కు చెందిన తిప్సచా యొద్వరీని, జైస్మిన్ ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నిగినా ఉక్తామోవాను ఓడించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో విశ్వనాథ్ సురేష్, సచిన్ కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఆకాష్, లోకేష్, నరేందర్, హర్ష్ చౌదరి సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్