ఏషియన్ గేమ్స్-2026: సెమీ ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 9.5 ఓవర్లలో 45 పరుగులకే SL ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. బుమ్రా, అక్షర్, అభిషేక్ తలో 2, సుందర్ ఒక వికెట్ తీశారు. ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్ తో OCT 3న టీమిండియా తలపడనుంది.