ఏషియన్ గేమ్స్-2026లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్నసెమీ ఫైనల్లో టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (80*) హాఫ్ సెంచరీతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (38) మినహా మిగతా బ్యాటర్లేవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. తరిందు రత్నాయకే, సహన్ అరాచ్చిగే చెరో రెండు వికెట్లు పడగొట్టగా, వనుజా, లసిత్ క్రూస్పుల్లే, నువానీడు ఫెర్నాండో తలో వికెట్ తీశారు. శ్రీలంక లక్ష్యం 170 రన్స్.