ఆసియా క్రీడలు: షూటింగ్‌లో భారత్‌కు రజతం

ఆసియా క్రీడలు-2026లో మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. తిలొత్తమ సేన్‌, విదర్శ వినోద్‌ కొచలుమ్‌కల్‌, ఆశి చౌక్సే జట్టు 1763 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా 1773 పాయింట్లతో స్వర్ణం, కజకిస్థాన్‌ 1754 పాయింట్లతో కాంస్యం సాధించాయి. వ్యక్తిగత విభాగంలో తిలొత్తమ 590 పాయింట్లతో మూడో స్థానం, విదర్శ 588 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕