జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు నేడు పలు విభాగాల్లో పోటీ పడనున్నారు. మహిళల హాకీ, కబడ్డీ మెన్స్ & ఉమెన్స్, బ్యాడ్మింటన్ పురుషుల టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. బాక్సర్ సుమిత్ 70KG విభాగంలో పోటీ పడనున్నారు. భారత టేబుల్ టెన్నిస్ టీమ్స్ పాకిస్థాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, షూటింగ్, సెపక్ తక్రా, సాఫ్ట్ టెన్నిస్, స్విమ్మింగ్, వుషు గేమ్స్‌లో కూడా భారత క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం భారత్ 2 సిల్వర్ మెడల్స్‌తో పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉంది.