అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా నిరోధించేందుకు, 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. అసాధారణ సందర్భాల్లో ఆధార్ కార్డు జారీకి జిల్లా కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని, దరఖాస్తుదారు అర్హుడా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ నిర్ణయం శనివారం వెల్లడైంది. ఈ చర్య ద్వారా అక్రమ వలసదారులను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.