అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే!

TG: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించనున్నారు. పుదుచ్చేరి స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్