TG: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండంతో కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా వీహెచ్ హనుమంతరావు కూడా రాజ్యసభ స్థానం ఆశిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈసారైనా రాజ్యసభ అవకాశం నాకే ఇవ్వాలి. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేస్తున్నా. ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ నేనుంటా. గత పదేళ్లుగా పార్టీలో నాకు అన్యాయం జరిగింది. ఎలాంటి పదవి లేదు. అయినా నిరంతరంగా పని చేస్తున్నా' అని అన్నారు.