లండన్‌లోని ఓవల్ మైదానం టీమిండియాతో వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీంతో ప్రసిద్ధ్ కృష్ణకు నాలుగో వికెట్ దక్కింది. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో 47వ ఓవర్లో ఐదో బంతికి ఆకాశ్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి గస్ అట్కిన్‌సన్ ఔట్ అయ్యారు. కాగా, ఇంగ్లండ్ 9 పరుగులు వెనకంజలో ఉంది. 48 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 242/8గా ఉంది. క్రీజులోకి జోష్ టంగ్(0), హ్యారీ బ్రూక్(48) ఉన్నారు. వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడింది.