AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరంలో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న ఒక బాలికను పీటీఐ లైంగిక వేధింపులకు గురిచేశాడు. జరిగిన విషయాన్నీ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్స్ ఇప్పిస్తాను అని చెప్పి బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.