TG: దారుణం.. బతికుండగానే డెత్ సర్టిఫికెట్!

ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ సొంతూరికి తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతడి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్