వైసీపీ నేత ఇంట్లో దారుణం.. తల్లి మృతి, తండ్రికి గాయాలు

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తిలోని పుల్లారెడ్డి కండ్రిగలో వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కత్తులతో దాడిలో మధుసూదన్ తల్లి జయమ్మ (80) మృతిచెందగా, తండ్రి మహాదేవరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్