యూపీలోని లక్నోలో లులూ మాల్ మేనేజర్ మహ్మద్ ఫర్హాజ్(27) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో మహిళా ఉద్యోగిని ట్రాప్‌లో వేసి, హోటల్‌కి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. రహస్యంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు తెలిపింది. ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చాడని, సిగరెట్లతో కాల్చి టార్చర్ పెట్టాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.