TG: మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చింతల్ తండాలో ఆస్తి వివాదంతో సునీత (28) హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో కొంతకాలంగా భర్త బాల్‌రాంకు, సునీతకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. పెద్దమనుషుల తీర్పు మేరకు బలరాంకు చెందిన ఎకరంన్నర భూమిని సునీత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో కుటుంబంలో ఆస్తి వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. పొలం వద్దకు వెళ్తున్న సునీతను ఇంటికి తీసుకెళ్లిన బలరాం సోదరులు, వారి కుటుంబ సభ్యులు, మరో వ్యక్తి కలిసి సునీత గొంతు కోసి, తల, మొండెం వేరయ్యేలా నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.