AP: ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో దారుణం జరిగింది. పూళ్ల గ్రామానికి చెందిన పాతల నాగరాజును అదే గ్రామానికి చెందిన కాండ్రు నాగతేజ అతని సన్నిహితులు కొంతమంది కత్తితో అతికిరాతకంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనాబాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏలూరు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.